National Emblem: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా అవిష్కరించనున్న జాతీయ చిహ్నం ఇది. కేంద్ర ప్రభుత్వం దిల్లీలో నిర్మిస్తున్న పార్లమెంట్ భవనం ‘సెంట్రల్ విస్టా’లో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలో సింహాలు గర్జిస్తున్నట్లుగా ఉన్నాయంటూ ప్రతిపక్షాలు, సామాజిక మాధ్యమాల్లో పలువురు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన చిహ్నం ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మాత్రం జాతీయ చిహ్నంలో సింహాలు గర్జిస్తున్నట్లుగా కాకుండా గంభీరంగా ఉన్నాయి.
National Emblem: ఈ సింహాలు గంభీరం - పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం తాజా వార్తలు
National Emblem: అత్యాధునిక సాంకేతికతో.. ఆధునిక పరిజ్ఞానంతో ఐకానిక్ భవనంగా రూపుదిద్దుకుంటున్న కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభోత్సం సందర్భంగా ఆవిష్కరించనున్న జాతీయ చిహ్నం ఇది. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
National Emblem
రాష్ట్ర పభుత్వం హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభానికి ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా మంగళవారం భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించడంతో ఇలా వెలుగులీనింది.