ప్రస్తుత సచివాలయాన్ని కూల్చకుండా కొవిడ్ ఆస్పత్రిగా మార్చాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అలా చేస్తే తెలంగాణ ప్రజలకు మేలు చేసిన వారవుతారన్నారు. రోజురోజుకు కరోనా ఉద్ధృతి పెరుగుతోందని.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సచివాలయాన్ని ఆస్పత్రిగా మార్చి సౌకర్యాలు కల్పించాలని విన్నవించారు. నగరానికి మధ్యలో సెక్రటేరియేట్ ఉన్నందున అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు అందుబాటులో ఉంటుందన్నారు.
సచివాలయాన్ని కొవిడ్ ఆస్పత్రిగా మార్చండి: నాగం - nagam on covid effect in telangana
సచివాలయాన్ని కూల్చకుండా కరోనా ఆస్పత్రిగా మార్చాలని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలని సూచించారు.
సచివాలయాన్ని కొవిడ్ ఆస్పత్రిగా మార్చండి: నాగం