రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పురపాలికలు, విలీన గ్రామాలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామ పంచాయితీల్లో భూముల క్రమబద్ధీకరణ కోసం పురపాలక శాఖ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇచ్చింది. ప్రత్యేకాధికారులను నియమించి.. వారికి రోజూవారి లక్ష్యాలను నిర్దేశించాలని పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.
భూముల క్రమబద్ధీకరణ గడువు సెప్టెంబర్ 30 వరకు పెంపు - భూముల క్రమబద్ధీకరణ
కొత్తగా ఏర్పాటైన పురపాలికలు, విలీన గ్రామాలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామ పంచాయితీల్లో భూముల క్రమబద్ధీకరణ కోసం పురపాలక శాఖ గడువును సెప్టెంబర్ 30 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేకాధికారులను నియమించి రోజువారి లక్ష్యాలు నిర్దేశించాలని ఆదేశాలు జారీ చేసింది.
43 కొత్త పురపాలికలు, 39 పురపాలికల్లో విలీనమైన గ్రామాలు, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్ధిపేట పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని 119 గ్రామ పంచాయితీల్లో లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2018 మార్చి 3111 లోపు కొనుగోలు చేసిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. గడువు పొడిగించిన నేపథ్యంలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సీడీఎంఏ అధికారులకు స్పష్టం చేసారు. ప్రభుత్వం ఇచ్చిన 16 వారాల్లో ప్రతి శనివారం లేదా శుక్రవారం పురోగతిని సమీక్షించాలని తెలిపారు.
ఇవీ చూడండి:విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు