దుకాణాలు తిరిగి ప్రారంభించేందుకు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ... మున్సిపల్ కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రీన్ ఆరెంజ్ జోన్లలో వ్యవసాయ, మెడికల్, నిర్మాణ రంగానికి సంబంధించిన దుకాణాలు, లిక్కర్ షాపులు మిగహా... నంబర్ల ఆధారంగా సరి, బేసిగా విభజించి... రోజు విడిచి రోజు తెరిచేందుకు అనుమతించనున్నారు.
దుకాణాలు తెరిచేందుకు నిబంధనలు.. ఉత్తర్వులు జారీ
దుకాణాలు తెరిచేందుకు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా... మున్సిపల్ శాఖ నిబంధనలు విడుద చేసింది. ఈ మేరకు అన్ని పురపాలక కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే రోజు పక్క పక్క దుకాణాలు తెరిచి ఉంచటానికి వీల్లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిబ్బందితో పాటు వినియోగదారులు కూడా తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. మాస్కు లేని వారికి విక్రయించకూడదని నిర్ణయించారు. దుకాణాల ద్వారాల వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచాలన్నారు. మున్సిపల్ అధికారులు, జిల్లా కలెక్టర్, పోలీసులు పర్యవేక్షించాలని తెలిపారు. అన్ని జోన్లలో విద్యా సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మత పరమైన కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఈ-కామర్స్కు అనుమతించారు.
ఇదీ చూడండి:మద్యం కోసం వచ్చారు.. భౌతిక దూరం మరిచారు