Munawar Faruqui: భారీ బందోబస్తు నడుమ హైదరాబాద్ శిల్పకళావేదికలో మునావర్ ఫారూఖీ కామెడీ షో కొనసాగింది. షోను అడ్డుకుంటామని ఎమ్మెల్యే రాజాసింగ్ సహా బీజేవైఎం నేతల హెచ్చరికలతో శిల్పకళావేదిక వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఐదుగురు డీసీపీలతో పాటు 500 మంది పోలీసులను మోహరించారు. ఆధార్ కార్డు చూసి పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతనే ప్రేక్షకులను నిర్వాహకులు లోపలికి పంపించారు.
భారీ బందోబస్తు నడుమ కొనసాగిన మునాషార్ స్టాండప్ కామెడీ షో - Munawar Faruqui statements
Munawar Faruqui నాటకీయ పరిణామాల అనంతరం హైదరాబాద్ శిల్పకళావేదికలో మునాషార్ స్టాండప్ కామెడీ షో జరిగింది. షోను అడ్డుకుంటామన్న భాజపా హెచ్చరికలతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. షోను అడ్డుకునేందుకు యత్నించిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
Munawar Faruqui standard comedy show held in shilpakalavedhika Between provision
షోను ఎట్టిపరిస్థితుల్లో సెల్‌ఫోన్లలో చిత్రీకరించవద్దని నిర్వాహకులు సూచించారు. మునావర్ ఫారూఖీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి శిల్పకళా వేదిక గేట్ లోపలికి దూకి వెళ్లేందుకు యత్నించిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించిన 50 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: