హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు వరదలో మునిగితే... మంత్రి కేటీఆర్ తీగల వంతెన ప్రారంభమంటూ హడావిడి చేస్తున్నారని... మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. వరద ముంపునకు గురైన సరూర్‌నగర్, లింగోజిగూడ, బైరామల్‌గూడ, దిల్సుఖ్నగర్, గడ్డిఅన్నారం ప్రాంతాల్లో రేవంత్‌రెడ్డి పర్యటించారు.
'ఓ పక్క హైదరాబాద్ మునిగిపోతుంటే పట్టించుకోరా...?'
హైదరాబాద్‌లోని పలు లోతట్టు ప్రాంతాలను ఎంపీ రేవంత్‌రెడ్డి సందర్శించారు. మురికి కాలువలను పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
'ఓ పక్క హైదరాబాద్ మునిగిపోతుంటే పట్టించుకోరా...?'
లోతట్టు ప్రాంతాల కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మురికి కాలువలను పరిశీలించారు. సరూర్‌నగర్ పరిధిలోని పలు కాలనీల ప్రజలు బయటకి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... పురపాలక మంత్రి, ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.