తెలంగాణ

telangana

ETV Bharat / city

'గ్రామాభివృద్ధి కోసం బడ్జెట్​లో అధిక నిధులు కేటాయించాం'

గ్రామాభివృద్ధి కోసం ప్రతి గ్రామానికి కార్యదర్శిని నియమించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తెలిపారు. 30రోజుల ప్రణాళికపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 36 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల జీతాలు రూ.8500కు పెంచామన్నారు.

"గ్రామాభివృద్ధి కోసం బడ్జెట్​లో అధిక నిధులు కేటాయించాం"

By

Published : Sep 18, 2019, 2:11 PM IST

పంచాయతీరాజ్‌ శాఖ బలోపేతానికి ఖాళీలు భర్తీ చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు స్పష్టం చేశారు. 30రోజుల ప్రణాళికపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. గ్రామాభివృద్ధి కోసం ప్రతి గ్రామానికి కార్యదర్శిని నియమించినట్లు పేర్కొన్నారు. 36 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల జీతాలు రూ.8500కు పెంచినట్లు సభకు తెలిపారు. గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బడ్జెట్‌లో గ్రామ పంచాయతీలకు ఎక్కువ నిధులు కేటాయించామన్నారు. గ్రామాల్లో చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో అందరూ పాల్గొనాలని సూచించారు.

"గ్రామాభివృద్ధి కోసం బడ్జెట్​లో అధిక నిధులు కేటాయించాం"

ABOUT THE AUTHOR

...view details