Medical Students Protest: ఇటీవల రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలను రద్దు చేస్తూ... నేషనల్ మెడికల్ కౌన్సిల్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎంఎన్ఆర్ వైద్య కళాశాల విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. గత నెలలోనే తమ సీట్లను రద్దు చేసినట్టు ఎన్ఎంసీ అధికారికంగా ప్రకటించినా.. ఇప్పటి వరకు తమకు వేరే చోట సర్దుబాటు చేయకపోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కోటీ డీఎంఈ కార్యాలయ ఆవరణలో ధర్నా చేసిన విద్యార్థులు.. ప్రభుత్వం తమకు సీట్లు కేటాయించాలని అందుకు సంంధించిన ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీట్ల సర్దుబాటుకి సంబంధించిన కాళోజీ వర్సిటీ అధికారులను కలిసేందుకు ప్రయత్నించినా ఎలాంటి స్ఫందనలేదన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఇలాంటి పరిస్థితే ఎదురైన విషయాన్ని గుర్తు చేసిన విద్యార్థులు.. రద్దయిన సీట్లు తిరిగి రావటం ఇప్పటివరకు జరగలేదని వ్యాఖ్యానించారు.
నిరసనకు దిగిన వైద్య విద్యార్థులు.. సీట్లు సర్దుబాటు చేయాలని డిమాండ్
Medical Students Protest: హైదరాబాద్లోని కోటీ డీఎంఈ కార్యాలయ ఆవరణలో ఎంఎన్ఆర్ వైద్య కళాశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. తమ సీట్లు రద్దై నెల గడుస్తున్నా.. ఇప్పటి వరకు యూనివర్సిటీ యాజమాన్యం తమకు వేరే చోట సర్దుబాటు చేయకపోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు సీట్లు సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు.
"మా సీట్లు రద్దయినట్టు మే 19న ఎంఎన్సీ అధికారిక వెబ్సైట్లో పెట్టింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాకు 28న తెలిసింది. 19 నుంచి 28 వరకు మా కాలేజీ గానీ.. యూనివర్సిటీ గానీ.. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. 29న మా ప్రిన్సిపల్ని అడిగితే.. ఆ సమాచారం సరైంది కాదన్నట్టు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరూ.. మా సీట్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అందుకే ఈరోజు ఇలా ధర్నా చేయాల్సివస్తోంది. సీట్లు రద్దయితే వేరే కళాశాలలో సర్ధుబాటు చేయాలని ఎంఎన్సీ గైడ్లైన్స్ చెబుతున్నాయి. అయినప్పటికీ యూనివర్సిటీ గానీ.. ప్రభుత్వం గానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆలస్యమైనాకొద్దీ.. మా అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మా సీట్లు సర్దుబాటు చేయాలని కోరుతున్నాం." - వైద్య కళాశాల విద్యార్థులు
ఇవీ చదవండి: