తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే విద్యావ్యవస్థ కుంటుపడుతుంది' - తెలంగాణలో విశ్వవిద్యాలయాల సమాచారం

టైం స్కేల్, కాంట్రాక్టు ఉద్యోగులకు ఈపీఎఫ్ వర్తించేందుకు తాను కృషి చేస్తానని ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. ఈ మేరకు ఓయూ దూరవిద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో అయన పాల్గొన్నారు.

mlc ram chander told education system cripples if government neglects
'ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే విద్యావ్యవస్థ కుంటుపడుతుంది'

By

Published : Feb 5, 2021, 7:17 PM IST

ప్రభుత్వం యూనివర్సిటీలకు వీసీలను నియమించకపోవడం వల్ల ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ రాంచందర్​ రావు అన్నారు. టైం స్కేల్, కాంట్రాక్టు ఉద్యోగులకు ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓయూ దూరవిద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన పాల్గొన్నారు.

టైం స్కేల్, కాంట్రాక్టు ఉద్యోగులకు ఈపీఎఫ్ వర్తించేందుకు తాను కృషి చేస్తానని ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు శాసనమండలిలో చర్చిస్తామన్నారు. నిర్లక్ష్యం వహిస్తే విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:సినిమాలో జోకర్ని.. నిజ జీవితంలో హీరోని: బాబుమోహన్

ABOUT THE AUTHOR

...view details