తెలంగాణ

telangana

By

Published : Jan 20, 2021, 3:53 PM IST

ETV Bharat / city

'నీళ్లు, నిధులు, నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం'

నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు. కేంద్రం ఆదేశాలు కాదని ప్రాజెక్టులు కడితే.. రాష్ట్రం నష్టపోతుందని వివరించారు. మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రం ఇప్పుడు 3 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి వెళ్లిందని జీవన్​రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

mlc jeevanreddy fire on cm kcr
mlc jeevanreddy fire on cm kcr

'నీళ్లు, నిధులు, నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం'

కేంద్రం ఆదేశాలు కాదని ప్రాజెక్టులు కట్టడం వల్ల రాష్ట్రం నష్టపోతుందని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణానదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులు ప్రశ్నార్థకం కాబోతున్నాయన్న జీవన్​రెడ్డి... ఏపీలో నిర్మిస్తున్నవి అక్రమ ప్రాజెక్టులంటున్నప్పుడు ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన బిల్లుకు భిన్నంగా ఎవరు ఏ ప్రాజెక్టు కట్టినా... అవి అక్రమ ప్రాజెక్టులుగా గుర్తిస్తామని కేంద్ర మంత్రి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిందే... నీళ్లు, నిధులు, నియామకాల కోసమన్న ఆయన... ఆ మూడింటిలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు.

మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రం ఇప్పుడు 3 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి వెళ్లిందని జీవన్​రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలు తరలిస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులకు ఏపీ భంగం కలిగిస్తుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: కేటీఆర్​ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి: తలసాని

ABOUT THE AUTHOR

...view details