గ్రేటర్ ఎన్నికల ఫలితాలతోనైనా... తెరాస కళ్లు తెరవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇకనైనా కేసీఆర్ మేల్కొనకపోతే మరింతగా నష్టపోతారని జీవన్ రెడ్డి హితవు పలికారు. రబీ సాగు ప్రారంభమైనా రైతుబంధు ఊసే లేదని... అదే ఎన్నికలు ఉంటే వెంటనే బ్యాంకు ఖాతాల్లో జమయ్యేవని ఎద్దేవా చేశారు. వ్యవసాయాధికారుల నిర్లక్ష్యంతో ధాన్యం సేకరణలో విఫలమయ్యారని ఆరోపించారు.
ఎన్నికలుంటేనే.. సర్కారుకు రైతుబంధు గుర్తొస్తుంది: జీవన్ రెడ్డి
గ్రేటర్ ఫలితాలతోనై మేల్కొనకపోతే తెరాస మరింత నష్టపోతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హతవు పలికారు. ఎన్నికలు ఉంటేనే... రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఎన్నికలుంటేనే.. ఖాతాల్లో రైతుబంధు జమైతుంది: జీవన్ రెడ్డి
మహారాష్ట్రలో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల సహాయం అందిస్తుంటే... తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌లో చాలా సమస్యలున్నాయని... కలెక్టర్ల నుంచి రిపోర్ట్ తెప్పించుకుని పరిష్కరించాలన్నారు. వారసత్వ భూమి రిజిస్ట్రేషన్‌కు చాలా అడ్డంకులు ఉన్నాయని... హిందూ వారసత్వ ప్రక్రియను తెరాస ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు.
ఇదీ చూడండి:'అదే అగాధంలోకి యావత్ దేశాన్ని నెడుతున్నారు'
TAGGED:
mlc jeevan reddy suggest