నిఘావర్గాల హెచ్చరికలతో గోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భద్రతను పెంచారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటుచేసినట్లు తెలిపిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్... డీసీపీ స్థాయి అధికారితో సెక్యూరిటీని పర్యవేక్షించనున్నట్లు వివరించారు.
నాకు ఎవరి నుంచి ప్రాణహాని ఉందో చెప్పండి: రాజాసింగ్ - rajasingh news
భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు భద్రత పెంచారు. నిఘా వర్గాల హెచ్చరిక దృష్ట్యా రాజాసింగ్‌కు సెక్యూరిటీని పెంచామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ద్విచక్రవాహనంపై తిరగవద్దంటూ ఎమ్మెల్యేకు సూచించారు.
raja
బైక్‌పై తిరగవద్దని... కేవలం ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే వెళ్లాలని సీపీ సూచించారు. ఈమేరకు ఎమ్మెల్యేకు అంజనీ కుమార్ లేఖ రాశారు. దీనిపై స్పందించిన రాజాసింగ్... ఎవరి నుంచి తనకు ప్రాణహాని ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ విషయంపై కేంద్ర, రాష్ట్రాల హోంశాఖ మంత్రులకు లేఖ రాయాలని నిర్ణయించారు.
ఇదీ చూడండి :ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి
Last Updated : Aug 29, 2020, 4:48 PM IST