హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని గణపతి కాంప్లెక్స్‌లో టీవీ సీరియల్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొని నిత్యావసరాలు పంచారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కరోనా వైరస్ నిర్మూలనకు ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌కు తాము సంపూర్ణ మద్ధతు తెలుపుతున్నట్టు టీవీ సీరియల్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు లాక్డౌన్ సమయంలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశ్యంతో తమవంతుగా సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంచుతున్నట్టు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
సినీ కార్మికులకు సరుకులు పంచిన మాగంటి - MLA Maganti Distributes Essential Items
టీవీ సీరియల్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సీనీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంచారు.
సరుకులు పంచిన ఎమ్మెల్యే మాగంటి