అతనో ప్రజాప్రతినిధి... చట్టసభకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే. ప్రజాసేవ చేస్తానని ప్రమాణం చేశాడు. కానీ తన కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డ న్యాయవాదులను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్లో గురువారం జరిగింది.
న్యాయవాదులను ఢీకొట్టిన ఎమ్మెల్యే వాహనం - lb nagar
నల్గొండ శాసనసభ్యుడి కారు ఢీ కొని ఇద్దరు న్యాయవాదులకు తీవ్ర గాయాలయ్యాయి. కనీసం ఎలా ఉన్నారని కూడా చూడకుండా వెళ్లిపోయారని బాధితుల తరఫు వారు మండిపడుతున్నారు.
న్యాయవాదులను ఢీకొట్టిన ఎమ్మెల్యే వాహనం
న్యాయవాదులు నీరజ, కృష్ణయాదవ్ వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కారు ఢీకొంది. బాధితులు గాయాలపాలైన పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ప్రస్తుతం వారు ఓజోన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యేకు సమాచారమిచ్చినా..ఇప్పటి వరకు పరామర్శించలేదని తోటి న్యాయవాదులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా ఆసుపత్రి వద్ద ధర్నాకు చేశారు.
ఇదీ చూడండి: నీట మునిగిన నిజామాబాద్
Last Updated : Jul 20, 2019, 6:11 PM IST