ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఓట్ల కోసమే ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్, భాజపాలు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ పోస్టులు తెలంగాణలోనే భర్తీ చేశామని సుమన్ వెల్లడించారు.
'ఓట్ల కోసమే ఉద్యోగాల విషయంలో నిరాధార ఆరోపణలు' - mlc elections updates
ఎన్నికల్లో ఓట్ల కోసమే విపక్షాలు సత్యదూర ఆరోపణలు చేస్తున్నాయని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా నేతలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
mla balka suman fire on oppostions about jobs in telangana
కాంగ్రెస్ నేతలు కోరుతున్న చర్చ... వారి హయాంలో కొల్లగొట్టిన ఉద్యోగాలపై జరగాల్సిన అవసరముందన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి సహకారం అందించాలో భాజపా నేతలు ఆలోచించాలని హితవుపలికారు.