HARISH RAO: ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై ఆర్థికశాఖ కసరత్తు
21:28 July 10
HARISH RAO: ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై ఆర్థికశాఖ కసరత్తు
ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. ఆయా శాఖలు సమర్పించిన ఖాళీల వివరాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీలపై రేపు కీలక సమావేశం జరగనుంది. మరికొన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో హరీశ్‌రావు భేటీ కానున్నారు.
రాష్ట్రంలో కొలువుల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి అడ్డుంకులు తొలగిన నేపథ్యంలో ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విషయం విదితమే. ఈ మేరకు అన్ని శాఖల్లో 50 వేల ఖాళీలను మొదటి దశలో తక్షణమే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పదోన్నతుల ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండో దశలో భర్తీ చేయాలన్నారు. ఉద్యోగ భర్తీకి సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన నివేదికను సిద్ధం చేసి ఈ నెల 13న జరిగే మంత్రివర్గ సమావేశానికి తీసుకురావాలని అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నివేదికను సిద్ధం చేయడంపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టినట్లు సమాచారం.
ఇదీ చదవండి: Palle pragathi: ముగిసిన నాలుగో విడత.. అభివృద్ధిపై మంత్రి ఎర్రబెల్లి ఆరా.!