Minister Venugopala Krishna: సమాచార, బీసీ సంక్షేమశాఖ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ బాధ్యతలు చేపట్టారు. సీఎం జగన్‌ను ఆరాధించాను కాబట్టే తనకు మంత్రిపదవి వచ్చిందని వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల సమస్యలు తీరాలంటే సీఎం జగన్‌ను ఆరాధించాలని స్పష్టం చేశారు. పాత్రికేయుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు. పాత్రికేయులు కూడా సీఎంను మనస్ఫూర్తిగా ఆరాధిస్తే తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
Minister Venugopala Krishna: 'ముఖ్యమంత్రిని ఆరాధించండి.. ఆరా తీయకండి' - జర్నలిస్టులపై మంత్రి వేణుగోపాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
Minister Venugopala Krishna: పాత్రికేయుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. పాత్రికేయులు కూడా సీఎంను మనస్ఫూర్తిగా ఆరాధించాలని వ్యాఖ్యానించారు. సీఎంను ఆరాధిస్తే పాత్రికేయులకు తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు వస్తాయని హామీ ఇచ్చారు.
minister chelluboina
జగన్‌ను ఆరాధించకుండా ఆయన గురించి ఆరా తీస్తున్నారని... అది మానుకొని ఆరాధించాలని మంత్రి అన్నారు. సీఎంను ఆరాధిస్తే పాత్రికేయులకు తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు వస్తాయని చెప్పారు. డీబీటీ కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని తెలిపారు. 139 బీసీ ఉపకులాలకు ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. సినిమా పరిశ్రమకు ఏపీలో అభివృద్ధి అవకాశాలున్నాయని విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇదీ చదవండి:'నాకే టికెట్ వస్తుందో లేదో తెలియదు'