హైదరాబాద్ నగరంలో ఆస్తుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నారు. వెస్ట్మారెడ్పల్లిలోని తలసాని ఇంటికి వెళ్లి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ , జీహెచ్ఎంసీ అధికారులు మంత్రి ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
ఆస్తులను ఆన్‌లైన్ చేయించుకున్న మంత్రి తలసాని - ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నారు. వెస్ట్మారెడ్పల్లిలోని తలసాని ఇంటికి వెళ్లి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ , జీహెచ్ఎంసీ అధికారులు మంత్రి ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్న తలసాని
ప్రతి ఒక్కరూ ఆస్తుల నమోదు చేసుకునేందుకు ముందుకు రావాలని మంత్రి తలసాని పిలుపునిచ్చారు. ఎవరి ఆస్తుల వారికి దక్కెందుకే ఆన్‌లైన్‌లో నమోదు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ఇవీ చూడండి:అసెంబ్లీ ముట్టడికి సీపీఐ పిలుపు.. పోలీసుల ముందస్తు అరెస్టులు