జీహెచ్ఎంసీ ఎన్నికలతో సంబంధం లేని అంశాలను విపక్ష పార్టీలు ప్రస్తావిస్తూ ప్రచారం గావిస్తున్నాయని మంత్రి తలసాని ఆరోపించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సభలో అన్ని డివిజన్ల అభ్యర్థులు, పార్టీ క్యాడర్, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.
సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని - జీహెచ్ఎంసీ ఎన్నికలు
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. గ్రేటర్ ఎన్నికలతో సంబంధం లేని అంశాలను విపక్ష పార్టీలు ప్రస్తావిస్తున్నాయని మంత్రి విమర్శించారు.
సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని
ఆరేళ్లలో ప్రభుత్వ పనితీరు, భవిష్యత్తులో నగరాభివృద్ధి ప్రణాళికలపై ఈ సభ ద్వారా సీఎం దిశానిర్దేశం చేస్తారని తలసాని ప్రకటించారు. హైదరాబాద్‌తో సంబంధంలేని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ భాజపా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయటమేంటని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి: 'పీవీ, ఎన్టీఆర్ ఘాట్లు కూల్చివేస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా?'