Talasani Srinivas Yadav: భాగ్యనగరంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణికుల సౌలభ్యం కోసం మరిన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్‌లోని సంగీత్ వద్ద ఐదు కోట్ల రూపాయలతో కొత్తగా ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ను మంత్రి ప్రారంభించారు. పాదచారులను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన పైవంతెనల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, డిప్యూటీ మేయర్ శ్రీలత పాల్గొన్నారు.
భాగ్యనగరవాసులకు శుభవార్త.. అందుబాటులోకి రానున్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్‌లు! - మంత్రి తలసాని తాజా వార్తలు
Talasani Srinivas Yadav: ప్రయాణికుల సౌలభ్యం కోసం హైదరాబాద్‌లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో మరిన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌లోని సంగీత్ వద్ద 5 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ను మంత్రి ప్రారంభించారు.
Talasani inaugurates new foot over bridge
విద్యార్థులకు, పాదాచారులకు ఈ పుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు ఎంతగానో ఉపయోగపడుతాయని మంత్రి తలసాని పేర్కొన్నారు. పాదచారులను దృష్టిలో ఉంచుకుని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లతోపాటు మరిన్ని ఫ్లైఓవర్లు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కొంతమందికి కానరావడం లేదని ఆయన ఆరోపించారు.
ఇవీ చదవండి: