సికింద్రాబాద్ పద్మారావు నగర్ పార్కులో ఆరో విడత హరితహారంలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొక్కలు నాటారు. నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
'హరితహారంలో మంత్రి తలసాని.. మొక్కలు నాటాలని విజ్ఞప్తి..'
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం కేసీఆర్ మానస పుత్రిక అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభివర్ణించారు. ఆరో విడత హరితహారంలో భాగంగా ఆయన పద్మారావు నగర్ పార్కులో మొక్కలు నాటారు.
'మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేసిన మంత్రి'
జీహెచ్ఎంసీ విభాగం మెుక్కలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని మంత్రి అన్నారు. బలరాం కాంపౌండ్ వద్ద రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు పనులను తలసాని ప్రారంభించారు.
ఇదీ చూడండి :దంపతులపై కత్తులతో ఎటాక్.. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం