తెలంగాణ

telangana

ETV Bharat / city

'అంగీకారం తెలిపి మళ్లీ ఆందోళనలేంటీ..?' ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం..

Minister Suresh on employees: ఏపీలో ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపై మంత్రి సురేశ్​ స్పందించారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో పీఆర్సీని అంగీకరించి ఇప్పుడు ఇలా చేయటం సరికాదని మండిపడ్డారు.

minister-suresh-comments-on-employees-protests in ap
minister-suresh-comments-on-employees-protests in ap

By

Published : Jan 20, 2022, 5:16 PM IST

Minister Suresh on employees: ఏపీలో ఆందోళనలు చేస్తున్న ఉద్యోగులపై మంత్రి సురేశ్ మండిపడ్డారు. సీఎం జగన్​తో సమావేశంలో ఉద్యోగులు పీఆర్సీని అంగీకరించి.. మళ్లీ ఇప్పుడు ఆందోళనలు చేయటం సరికాదన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చన్నారు.

సెలవులు ఇచ్చే ఆలోచన లేదు..

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. దాని తీవ్రత అంతగా లేదని మంత్రి సురేశ్ తెలిపారు. ఇప్పట్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదన్నారు. ఒకవేళ ఏదైనా పాఠశాలలో పిల్లలకు కరోనా సోకితే.. ఆ పాఠశాలను మూసివేసి శానిటైజ్ చేసిన తర్వాత ప్రారంభిస్తామని మంత్రి సురేశ్ వెల్లడించారు. రాష్ట్రంలోని కొన్ని యూనివర్సిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయని.. కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందని తెలిపారు.

"సీఎం జగన్​తో ఉద్యోగ సంఘాలన్ని సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో సర్వీస్​ పొడిగింపు, ఫిట్​మెంట్​పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సంతోషంగా ఆంగీకారం తెలిపారు. అప్పుడు ఒప్పుకుని ఇప్పుడు మళ్లీ ఇలా ఆందోళనలు చేయటం సరైంది కాదు. ఏదేమైనప్పటికీ.. ఉద్యోగ సంఘాలు డిమాండ్​ చేస్తున్న అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఏవైనా ఇబ్బందులుంటే ప్రభుత్వంతో మాట్లాడొచ్చు. పండగ తర్వాత.. అన్ని విద్యాసంస్థల్లో 80 శాతం హాజరు నమోదవుతోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం." - సురేశ్​, ఏపీ మంత్రి

ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట

ప్రభుత్వ జీవోలను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో పీఆర్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వెంటనే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details