భారత్, శ్రీలంక మధ్య ఉన్న పాక్ జలసంధిని ఈదిన రెండో మహిళగా శ్యామల రికార్డు సృష్టించడం గర్వకారణమని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. 47 ఏళ్ల శ్యామల.. 13 గంటల 43 నిమిషాల్లో 30 కిలోమీటర్ల సముద్ర దూరాన్ని ఈదిన తొలి తెలుగు మహిళగా రికార్డు సృష్టించారన్నారు.
పాక్ జలసంధిని ఈదిన శ్యామలను సత్కరించిన మంత్రి - తెలంగాణ క్రీడా వార్తలు
పాక్ జలసంధిని ఈదిన శ్యామలను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ ఘనంగా సత్కరించారు. ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
పాల్క్ జలసంధిని ఈదిన శ్యామలను సత్కరించిన మంత్రి
ఈ సందర్భంగా గోలి శ్యామలను ఆయన నివాసంలో ఘనంగా సత్కరించారు. శ్యామలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల ఆర్థిక సహాయం అందిస్తుందని.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, సాట్స్ స్విమ్మింగ్ కోచ్ ఆయుష్ యాదవ్, మర్రి లక్ష్మా రెడ్డి కళాశాలల అధిపతి మల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి:త్వరలో సర్కారు బడులకు సరికొత్త హంగులు!
Last Updated : Apr 3, 2021, 9:45 AM IST