తెలంగాణ

telangana

ETV Bharat / city

Niranjan Reddy : 'వరదతో పంప్‌హౌస్‌లు మునిగిపోతే ప్రభుత్వానిది తప్పంటారా..?'

Minister Niranjan reddy : వరదల వల్ల కాళేశ్వరం పంప్‌హౌస్‌లు మునిగిపోవడంపై విపక్షాలు చేసిన విమర్శలని మంత్రి నిరంజన్‌ రెడ్డి తప్పుబట్టారు. ప్రాజెక్టు ఇంజినీర్‌ అయిన పెంటారెడ్డిపై అవమానకర వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. గతంలో చాలా సార్లు ఇటువంటి భారీ వరదలు వచ్చినప్పుడు ఎన్నో ప్రాజెక్టులు మునిగిపోయాని గుర్తుచేశారు. ఎవరెంత అడ్డుకున్నా ఏడాదిన్నరలోపు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

Niranjanreddy
Niranjanreddy

By

Published : Jul 24, 2022, 1:21 PM IST

Updated : Jul 24, 2022, 2:25 PM IST

'వరదతో పంప్‌హౌస్‌లు మునిగిపోతే ప్రభుత్వానిది తప్పంటారా..?'

Minister Niranjan reddy : పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కృష్ణా నదిపై మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఆధారపడి ఉన్నాయని నిరంజన్​రెడ్డి అన్నారు. వరదల వల్ల కాళేశ్వరం పంప్‌హౌస్‌లు మునిగిపోవడంపై విపక్షాలు చేసిన విమర్శలని నిరంజన్‌ రెడ్డి తప్పుబట్టారు. గతంలో చాలా సార్లు ఇటువంటి భారీ వరదలు వచ్చినప్పుడు ఎన్నో ప్రాజెక్టులు మునిగిపోయాని స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఇంజినీర్‌ అయిన పెంటారెడ్డిపై అవమానకర వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు.

'నాగార్జునసాగర్ ప్రాజెక్టును నెహ్రూ కట్టారంటారు. శ్రీశైలం ప్రాజెక్టును నీలం సంజీవరెడ్డి కట్టారంటారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును వైఎస్ఆర్‌ కట్టారంటారు. కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్ గురించి మాత్రం మాట్లాడరు. నీటి లభ్యత ఉన్న చోటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాం. ఇంజినీరింగ్ మహాద్భుతం అని ప్రపంచం కీర్తిస్తోంది. 28 లక్షల క్యూసెక్కులు వచ్చినా తట్టుకునేలా కాళేశ్వరం నిర్మాణం. సాంకేతికంగా ఏ లోపం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం. వరదతో పంప్‌హౌస్‌లు మునిగిపోతే ప్రభుత్వానిది తప్పంటారా? 1998, 2009 లో శ్రీశైలం ప్రాజెక్టు మునిగిపోలేదా? నీటిరంగ నిపుణుడు పెంటారెడ్డిని అవమానిస్తారా. కాంగ్రెస్ హయాంలో పెంటారెడ్డి డిజైన్ చేసిన ప్రాజెక్టులు కట్టలేదా?' - నిరంజన్​రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

ప్రాజెక్టులు నీటిలభ్యత ఉన్న ప్రాంతాల్లో కట్టాలి.. కానీ జూరాల ప్రాజెక్టును నీటిలభ్యత ఉన్న ప్రాంతాల్లోనే కట్టారా అని ప్రశ్నించారు. నీటిలభ్యత ఉన్న దగ్గర పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును కడుతుంటే అటంకాలు కలిగించడం ఎంత వరకు సమంజసం అన్నారు. ఇప్పటికే లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈ ప్రాజెక్టుపై 180 కేసులు వేశారని పేర్కొన్నారు. ఎవరెంత అడ్డుకున్నా ఏడాదిన్నరలోపు ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Last Updated : Jul 24, 2022, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details