ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్లోని కేఎల్ఆర్ వెంచర్లో హరితహారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై... మొక్కలు నాటారు.
పెళ్లి, పుట్టిన రోజు వేడుకల్లో మొక్కలు నాటాలి: మంత్రి మల్లారెడ్డి - మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్లోని కేఎల్ఆర్ వెంచర్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి: మల్లారెడ్డి
ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు హరితహారంలో సైనికుల్లా పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ పుట్టిన రోజు, పెళ్లి రోజు సందర్భం ఏదైనా ఒక మొక్క నాటి, సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంసన్, తెరాస మల్కాజిగిరి పార్లమెంటు ఇంఛార్జీ రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కరోనా కట్టడిలో లోపాలున్నయ్.. వాస్తవమే: మంత్రి కేటీఆర్