వ్యవసాయేతర ఆస్తులకు భద్రత కల్పించేందుకే స్థిరాస్తులను ధరణిలో నమోదు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్... ధరణి పోర్టల్ ఒక అద్భుత సంస్కరణ అని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. తాము అధికారంలో ఉంటే.. ఎల్‌ఆర్‌ఎస్‌ను భాజపా ఎలా రద్దు చేస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ వ్యాప్తంగా ఆస్తిపన్నులో రాయితీ: కేటీఆర్ - ktr on greater elections 2020
ధరణి పోర్టల్ ఒక అద్భుత సంస్కరణ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పేద ప్రజలపై భారం లేకుండా ఎల్‌ఆర్ఎస్‌పై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రమంతా ఆస్తిపన్నులో రాయితీ ప్రకటించామని స్పష్ఠం చేశారు.
minister ktr on dharani scheme in meet the press program
పట్టణ ప్రాంతాల వారికి మెరూన్ రంగు పాస్‌పుస్తకాలను అందిస్తామని స్పష్టంచేశారు. దీని ద్వారా పేదలకు తమ ఆస్తులపై బ్యాంకు లోన్లు లభిస్తాయని కేటీఆర్ తెలిపారు. పేదల ప్రజలపై భారం లేకుండా ఎల్‌ఆర్ఎస్‌పై నిర్ణయం తీసుకున్నామని తెలిపిన కేటీఆర్... రాష్ట్రమంతా ఆస్తిపన్నులో రాయితీ ప్రకటించామని స్పష్ఠం చేశారు.