హైదరాబాద్ బయోడైవర్సిటీ కూడలిలో పైవంతెనను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ.69.47 కోట్ల వ్యయంతో... మూడు లేన్లుగా దాదాపు కిలోమీటర్ మేర నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి అదే మార్గంలో వెళ్లారు.
ఇకపై రైరై... హైదరాబాద్‌లో మరో పైవంతెన ప్రారంభం - బయోడైవర్సిటీ కూడలిలో పైవంతెనను ప్రారంభించిన కేటీఆర్
జీహెచ్‌ఎంసీ చేపట్టిన మరో పైవంతెన నేటి నుంచి నగర వాసులకు అందుబాటులోకి వచ్చింది. రూ.69.47 కోట్ల వ్యయంతో నిర్మించిన పైవంతెనను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, మేయర్ బొంతు రామ్మోహన్ పలువురు నాయకులు పాల్గొన్నారు.
ktr
బయోడైవర్సిటీ కూడలిలో వాహనదారుల కష్టాలు తీరనున్నాయి. హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో వాహన రద్దీ నియంత్రించడం.. సిగ్నల్ బాధలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పలుచోట్ల వంతెనలు నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్ని పైవంతెనలు అందుబాటులోకి వచ్చాయి. మైండ్ స్పేస్ నుంచి బాహ్య వలయ రహదారి వరకు నాలుగు లేన్ల వంతెన, బాహ్యవలయ రహదారి నుంచి కొండాపూర్ వరకు ఆరు లేన్ల పైవంతెన నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు.
Last Updated : Nov 4, 2019, 12:33 PM IST