'వరదసాయం కింద కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు'
వందేళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడ్డాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... నగరంలో వచ్చిన వరదలపై స్పందించారు. చెరువులు, నాలాల మీద ఎప్పటినుంచో ఉన్న ఆక్రమణల వల్లే వరద పోటెత్తిందని వెల్లడించారు. వరదసాయం కింద కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పటికే మూడు లక్షలకు పైగా బాధితులకు ప్రభుత్వ సాయం అందించామన్న కేటీఆర్... ఎన్నికల ప్రక్రియ అనంతరం మిగితా అర్హులకు కూడా అందిస్తామని స్పష్టం చేశారు.
'వరదసాయం కింద కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు'