తెలంగాణ

telangana

ETV Bharat / city

బతుకమ్మ బాగు... కవితకు మంత్రి కేటీఆర్ ప్రశంస

తెలంగాణ ఆడపడుచులకు మంత్రి కేటీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. దేశవిదేశాల్లో బతుకమ్మ ఖ్యాతి గడించడానికి తెలంగాణ జాగృతే కారణమని స్పష్టం చేశారు.

ktr

By

Published : Oct 2, 2019, 9:38 AM IST

Updated : Oct 2, 2019, 9:58 AM IST

బతుకమ్మ బాగు... కవితకు మంత్రి కేటీఆర్ ప్రశంస

తెలంగాణ పల్లె జీవితాన్ని, ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే అద్భుతమైన పండుగ బతుకమ్మ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పువ్వుల్ని పూజించే విశిష్ట సంప్రదాయాన్ని స్వరాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఆయుధంగా, విడదీయలేని ఉద్యమరూపంగా మార్చిన ఘనత తెలంగాణ జాగృతి సంస్థదే అన్నారు. దేశ, విదేశాల్లోని తెలంగాణ ఆడబిడ్డలు ఇవాళ బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి మాజీ ఎంపీ కవిత నాయకత్వంలో ఆనాడు జాగృతి చేసిన పోరాటమే కారణమన్నారు. నాటి సమైక్య పాలకులు ట్యాంక్ బండ్​పై బతుకమ్మను నిషేధించి తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తే, హైకోర్టుకు వెళ్లి మరీ సంబురంగా ఆడిన ఘన చరిత్ర జాగృతికి ఉందన్నారు. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పిస్తోన్న బతుకమ్మ చీరలకు ప్రేరణ జాగృతే అన్నారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన కవిత, దశాబ్ద కాలంగా జాగృతిలో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

Last Updated : Oct 2, 2019, 9:58 AM IST

ABOUT THE AUTHOR

...view details