తెలంగాణ

telangana

ETV Bharat / city

జీహెచ్​ఎంసీ అధికారుల తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం - జీహెచ్​ఎంసీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

హైదరాబాద్​లోని ఉప్పల్​ డివిజన్​లోని రామంతాపూర్, హబ్సిగూడవరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ సందర్శించారు. రామంతాపూర్ పెద్ద చెరువు నీటి పంపింగ్ ఏర్పాట్లపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.

Minister KTR angry over GHMC officials
జీహెచ్​ఎంసీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

By

Published : Oct 14, 2020, 3:52 PM IST

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టించారు. ఉప్పల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని రామంతాపూర్ చెరువు, హబ్సిగూడలో హోంమంత్రి మ‌హ‌ముద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్‌, ఎమ్మెల్యే సుభాశ్ రెడ్డితో క‌లిసి కలిసి వరద ప్రాంతాల్లోని పరిస్థితులను పర్యవేక్షించారు.

నీరు త్వరగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రామంతాపూర్ పెద్ద చెరువు నీటి పంపింగ్ ఏర్పాట్లపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీహెచ్​ఎంసీ అధికారుల మధ్య సమన్వయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ఇవీచూడండి:ఎల్బీనగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details