తెలంగాణ

telangana

ETV Bharat / city

రాజకీయ ప్రయోజనాల దృష్టిలోనే కేంద్రం కేటాయింపులు : కేటీఆర్ - minister ktr about defence sector

తెలంగాణలో ఎయిరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రక్షణ రంగానికి సంబంధించి అనుకూల పరిస్థితులున్నా.. కేంద్రం వివక్ష చూపుతోందని ఆక్షేపించారు.

minister ktr about defence and aerospace sector
రాజకీయ ప్రయోజనాల దృష్టిలోనే కేంద్రం కేటాయింపులు

By

Published : Mar 22, 2021, 12:56 PM IST

దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే కేంద్రం కేటాయింపులు ఉంటున్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఆరోపించారు. డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ కారిడార్‌ ఏర్పాటు విషయంలో కేంద్రం తీరుపై ఆయన మండిపడ్డారు.

ఏరోస్పేస్‌ రంగంపై శాసనమండలిలో మాట్లాడిన కేటీఆర్...... ఆ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆదిభట్ల, శంషాబాద్‌ ఏరోస్పేస్‌ ఎస్​ఈజెడ్​లో ఎన్నో ప్రముఖ సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు. ఈ-సిటీ ద్వారా డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థల పెట్టుబడులనూ ఆకర్షిస్తున్నామని వివరించారు.

ఇబ్రహీంపట్నంలో 100 ఎకరాల్లో మరో కాంపోజిట్‌ పార్కు ఏర్పాటు చేయబోతున్నామని కేటీఆర్ తెలిపారు, ఎయిర్‌బస్‌తోనూ సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. ఇంత అభివృద్ధి జరుగుతున్నా.... కేంద్రం వివక్షను చూపెడుతోందని కేటీఆర్ విమర్శించారు.

రాజకీయ ప్రయోజనాల దృష్టిలోనే కేంద్రం కేటాయింపులు

ABOUT THE AUTHOR

...view details