అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మన పథకాలను కేంద్రం కాపీకొడుతోందని తెలిపారు. అర్హులందరికి రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
'అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం' - మంత్రి హరీశ్‌రావు
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.
శిలాఫలకాలు నిర్మించారు... అభివృద్ధి మరిచారు
బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వరకు కొత్త రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వరకు రూ.49కోట్లతో దీనిని చేపట్టనున్నారు. అనంతరం 30లక్షల లీటర్ల సామర్థ్యంగల మిషన్ భగీరథ జలాశయం ప్రారంభించారు.