తెలంగాణ

telangana

ETV Bharat / city

'టిమ్స్​ను త్వరలోనే ప్రారంభిస్తాం... పూర్తిస్థాయి సిబ్బందిని నియమిస్తాం' - టిమ్స్ ఆస్పత్రి వార్తలు

టిమ్స్ ఆస్పత్రిలో వెయ్యి పడకలకు ఆక్సిజన్ అందించనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. గచ్చిబౌలిలోని టిమ్స్​ను సందర్శించారు. ఆస్పత్రిలోని సదుపాయాలపై అధికారులతో చర్చించారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి త్వరలోనే ఆస్పత్రిని ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు.

minister-etala-rajendar-visit-tims-hospital-at-gachibowli
టిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఈటల రాజేందర్

By

Published : Jun 24, 2020, 7:22 PM IST

గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ సెంటర్​ను మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. ఈ టిమ్స్ ఆస్పత్రిని అత్యాధునిక సాంకేతికతతో తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు.

ఆస్పత్రిలో వెయ్యి పడకలకు ఆక్సిజన్​ సౌకర్యం కల్పించామని మంత్రి పేర్కొన్నారు. 50 పడకలకు వెంటిలేటర్ల సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ పని చేసే వైద్యులకు, వైద్య సిబ్బందికి క్యాంటీన్ సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లోనే సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించి త్వరలోనే ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:హైదరాబాద్​కు ఏదో అవుతుందనే విషపు ప్రచారం తగదు: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details