పంచాయతీరాజ్ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా బలోపేతం చేయాలని ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించిన మంత్రి... జిల్లా, మండల, గ్రామపంచాయతీల్లోని ఖాళీల వివరాలు సోమవారంలోపు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం కోసం... 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు చర్యలు: ఎర్రబెల్లి - mandal parishat
గ్రామీణ వికాసంలో కీలకపాత్ర పోషించనున్న పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేయాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివెరిసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు చర్యలు: ఎర్రబెల్లి
పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా గ్రామపంచాయతీ బాధ్యత ఉండాలని మంత్రి అన్నారు. జడ్పీ పాఠశాలలపై జిల్లా పరిషత్తులకు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలపై మండల ప్రజా పరిషత్తుల పర్యవేక్షణ ఉంటే మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, పట్టు పరిశ్రమ శాఖలతోపాటు గ్రామాలలో తాగునీటి సరఫరా నిర్వహణ... సమన్వయం సైతం మండల పరిషత్తులకు ఉంటే పథకాల అమలు తీరు మెరుగ్గా ఉంటుందన్నారు.
ఇదీ చూడండి: పంచాయతీల అభివృద్ధిపై ఎర్రబెల్లి సమీక్ష