హైదరాబాద్ హైటెక్స్‌లో ఇండియా ల్యాబ్ అండ్ ఫార్మా ప్రో ప్యాక్ ఎక్స్‌ఫోను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. నేటి నుంచి మూడురోజుల పాటు జరగనున్న కార్యక్రమంలో ఫార్మా రంగానికి చెందిన సుమారు 300 మంది తాము రూపొందించిన అత్యాధునిక పరికరాలను ప్రదర్శించనున్నారు. దేశ అభివృద్ధిలో ఫార్మా కీలకపాత్ర పోషిస్తోందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఫార్మా పరిశ్రమలకు హబ్ అన్న ఈటల.. ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు. నాణ్యమైన వైద్య సదుపాయాలు తక్కువ ధరల్లోనే అందించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ పరిశ్రమల హబ్: మంత్రి ఈటల - pharma expo opend by minister eetala
తెలంగాణ రాష్ట్రం ఫార్మా పరిశ్రమలకు హబ్ అని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్‌లో ఇండియా ల్యాబ్ అండ్ ఫార్మా ప్రో ప్యాక్ ఎక్స్‌ఫోను ఆయన ప్రారంభించారు.
ఫార్మా ఎక్స్పోను ప్రారంభించిన మంత్రి ఈటల
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ..
TAGGED:
minister eetala