తెలంగాణ

telangana

ETV Bharat / city

మంత్రిగారూ... మారోడ్లు బాగు చేయండి..! - SRIDARBABU

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపరిస్థితి అధ్వాన్నంగా ఉందని కాంగ్రెస్​ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. కేవలం పెద్దపల్లి జిల్లాలోనే 33ఇసుక క్వారీలు ఉన్నాయని ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు అన్నారు. లారీలు ఓవర్​లోడ్​తో వెళ్తుండటం వల్ల జిల్లా పరిధిలోని రోడ్లు పూర్తిగా ధ్వంసమైతున్నట్లు సభలో ప్రస్తావించారు.

మంత్రిగారూ... మారోడ్లు బాగు చేయండి..!

By

Published : Sep 16, 2019, 6:34 PM IST

ఇసుక క్వారీల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు అన్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని శాసన సభలో ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 33ఇసుక క్వారీలు ఉన్నాయని పేర్కొన్నారు. లారీలు ఓవర్​లోడ్​తో వెళ్తుండటం వల్ల జిల్లా పరిధిలోని రోడ్లు పూర్తిగా ధ్వంసమైతున్నట్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. రోడ్లు బాగులేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. తక్షణమే కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

మంత్రిగారూ... మారోడ్లు బాగు చేయండి..!

ABOUT THE AUTHOR

...view details