తెలంగాణలో లాక్డౌన్ విధింపుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. లాక్డౌన్ వల్ల ఎంతో మంది జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. మరెంతో మంది జీవితాల్ని ప్రమాదంలో పడేస్తాయని తెలిపారు.
లాక్డౌన్ను 10 రోజుల మించి పెంచకూడదు: అసదుద్దీన్
రాష్ట్ర ఆరోగ్య విధానంలో కోర్టులు జోక్యం చేసుకోవడం ఆందోళన కలిగించే విషయమని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తెలంగాణలో లాక్డౌన్ విధించడం వల్ల ఎంతో మంది జీవనోపాధిని కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
లాక్డౌన్ వల్ల ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ కోరారు. లాక్డౌన్ను 10 రోజులకు మించి పొడిగించకూడదని విజ్ఞప్తి చేశారు.
హైకోర్టు ఒత్తిడి వల్లే.. ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని ఎంపీ అన్నారు. రాష్ట్ర ఆరోగ్య విధానంలో కోర్టులు జోక్యం చేసుకోవడం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాజ్యంగ బద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణ సర్కార్ అపెక్స్ కోర్టు సాయం తీసుకోవాలని సూచించారు.