బంగాల్లో ఎన్నికల సందర్భంగా అక్కడి పోలీసులు తనను అడ్డుకుంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఆ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే తమకు అవకాశం ఇవ్వాలని తెలిపారు. వామపక్ష, కాంగ్రెస్, భాజపా, టీఎంసీ పార్టీలు ర్యాలీలు నిర్వహిస్తున్నాయని తమకెందుకు అవకాశం ఇవ్వరని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ రాకముందే తమకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని... ఇప్పుడున్న పోలీసులను బదిలీ చేయకపోతే ఎన్నికలు పారదర్శకంగా జరగవని ఆందోళన వ్యక్తం చేశారు.
టీఎంసీ ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోంది: అసదుద్దీన్ - అసదుద్దీన్ ఒవైసీ వార్తలు
బంగాల్లో టీఎంసీ ప్రభుత్వం తాము సమావేశాలు నిర్వహించుకోకుండా ఆటంకాలు కలిగిస్తోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఆ రాష్ట్ర పోలీసులు తనను అడ్డుకుంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
టీఎంసీ ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోంది: అసదుద్దీన్
టీఎంసీ ప్రభుత్వం తాము సమావేశాలు నిర్వహించుకోకుండా ఆటంకాలు కలిగిస్తుందని ఆరోపించారు. అక్కడ తమ పార్టీ కొన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపారు. బంగాల్‌లోని ట్రైబల్ పార్టీలో అలయెన్స్ ఉందని వారితో కలిసి పనిచేస్తున్నామని అసద్ వివరించారు. సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉంటే గత లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 18సీట్లు గెలిచేది కాదని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ఓటీటీ, డిజిటల్ మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు