తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలీస్​స్టేషన్​ ఎదుట వలస కూలీల ఆకలి కేకలు

దాతల సాయాన్ని అధికారులు అడ్డుకోవటంతో వలస కూలీలు పోలీస్​ స్టేషన్​ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమ ఆకలి తీర్చాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

migrant-workers-protest-at-kamalapuram-police-station-for-food
పోలీస్​స్టేషన్​ ఎదుట వలస కూలీల ఆకలి కేకలు

By

Published : Apr 29, 2020, 11:38 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా కమలాపురంలో పోలీస్​స్టేషన్ ఎదుట వలస కూలీలు ఆకలికేకలు పెట్టారు. తమకు అన్నం పెట్టే దిక్కు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లాక్​డౌన్ నేపథ్యంలో కమలాపురంలో 34 రోజులుగా పుణ్యభూమి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ సాయినాథ్ శర్మ పేదలకు రెండు పూటలా అన్నం పెడుతున్నారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలైనా.. భోజనం రాకపోవటంతో నిర్వాహకులను పేదలు అడిగారు. ప్రభుత్వ అధికారులు ఆహారం పంపిణీని ఆపమన్నారని నిర్వాహకులు వారికి చెప్పారు. అనంతరం దాదాపు 100 మంది వలస కూలీలు పోలీస్​ స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు. ఎస్​ఐ సాయంత్రం మీ గుడిసెల వద్దకే వస్తారని...ఆయనకు సమస్య విన్నవించండని పోలీసు సిబ్బంది చెప్పటంతో స్టేషన్ నుంచి వారు వెనుదిరిగారు.

ABOUT THE AUTHOR

...view details