తెలంగాణ

telangana

ETV Bharat / city

నిలిచిపోయిన వైద్య సేవలు.. ఇబ్బందులు పడుతున్న రోగులు.. - medical services

రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. పార్లమెంట్‌లో జాతీయ వైద్యమండలి బిల్లు ప్రవేశపెట్టినందుకు నిరసనగా ఎన్‌ఎంసీ దేశవ్యాప్తంగా 24గంటల బంద్​కు పిలుపునిచ్చారు. వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళనలు చేస్తున్నారు.

bundh

By

Published : Jul 31, 2019, 10:12 AM IST

రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలు మినహా ఇతర వైద్య సేవలు నిలిచిపోయాయి. జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) బిల్లును లోక్‌సభ ఆమోదించిన నేపథ్యంలో.. బిల్లును వ్యతిరేకిస్తూ భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) దేశవ్యాప్తంగా 24 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. దీనికి ఐఎంఏ రాష్ట్ర కమిటీ సహా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, జూడాలు, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళనలు చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలకు అంతరాయం కలిగింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు లేక రోగులు అల్లాడుతున్నారు. ఉస్మానియా, నిమ్స్​కు దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు డాక్టర్లు లేక.. ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన వైద్య సేవలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details