రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుపై సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మైనారిటీ, మైనారిటీ యేతర వైద్య కాళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్-బీ కేటగిరి సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకే దక్కేలా నిబంధనలు సవరిస్తూ వైద్యారోగ్య శాఖ జీవో విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే లభించనున్నాయి. రాష్ట్రంలో మైనారిటీయేతర మెడికల్ కాలేజీల్లో మొత్తం 3,200 సీట్లు ఉండగా ఇందులో బీ కేటగిరీ కింద 35 శాతం అంటే 1120 సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు వీటికి అన్ని రాష్ట్రాల విద్యార్థులు అర్హులుగా ఉన్నారు.
వెయ్యికి పైగా తెలంగాణ విద్యార్థులకే ఎంబీబీఎస్ బీ కేటగిరి సీట్లు - వెయ్యికి పైగా తెలంగాణ వారికి ఎంబీబీఎస్ సీట్లు
12:57 September 29
వెయ్యికి పైగా తెలంగాణ విద్యార్థులకే ఎంబీబీఎస్ బీ కేటగిరి సీట్లు
తాజా సవరణ మేరకు బీ కేటగిరీలో ఉన్న 35శాతం సీట్లలో 85శాతం సీట్లు అంటే 952 సీట్లు ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థుల కోసం కేటాయించనున్నారు. కేవలం 15 సీట్లు మాత్రమే ఓపెన్ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులు పోటీ పడేందుకు అవకాశం ఉంది. మైనార్టీ కాలేజిల్లోనూ 137 బీ కేటగిరి సీట్లలో.. 116 సీట్లు ఇక్కడి విద్యార్థులకే దక్కనున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిషా, మధ్యప్రదేశ్, జమ్ముకాశ్మీర్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఓపెన్ కోటా విధానమే లేకపోగా... గతేడాది నుంచి అన్ని సీట్లు ఆయా రాష్ట్రాల విద్యార్థులకే దక్కేలా అక్కడి నిబంధనల్లో మార్పులు చేశారు. దీంతో ఒక వైపు రిజర్వేషన్ లేక సొంత రాష్ట్రంలో, మరో వైపు అవకాశం లేక ఇతర రాష్ట్రాల్లోని సీట్లు పొందలేక తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్ట పోతున్నారని పేర్కొన్న వైద్య ఆరోగ్య శాఖ... ఇక్కడి విద్యార్థులకు లాభం చేకూరెలా తాజా నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. దీంతో 1,068 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.
MBBS seats in Telangana: రాష్ట్రంలో 2022-23 వైద్యవిద్యా సంవత్సరానికి ప్రభుత్వ రంగంలో కొత్తగా 1200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికే మహబూబాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్, కొత్తగూడెం వైద్య కళాశాలలకు ఒక్కో దాంట్లో 150 చొప్పున కొత్తగా 900 సీట్లకు అనుమతి లభించింది. రామగుండంలో 150 సీట్లకు అనుమతి ఇవ్వడానికి అంగీకార పత్రాన్ని (లెటర్ ఆఫ్ ఇంటెంట్) జాతీయ వైద్య కమిషన్ ఇప్పటికే పంపించింది. ఇక మంచిర్యాలకు మాత్రమే అనుమతి రావాల్సి ఉంది. ఈ కళాశాలకు కూడా 150 సీట్లు ఇచ్చే అవకాశాలున్నాయి.
MBBS seats in Telangana 2022-23 : ప్రైవేటు రంగంలో గత ఏడాది టీఆర్‌ఆర్, మహావీర్, ఎంఎన్‌ఆర్ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఆర్, మహావీర్ కళాశాలల విద్యార్థులను ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేశారు. ఎంఎన్‌ఆర్ కళాశాలపై ఇంకా సందిగ్ధత తొలగలేదు. ఈ క్రమంలో 2022-23 వైద్యవిద్యా సంవత్సరానికి సంబంధించి ఈ కళాశాలకు తాజాగా అనుమతులు వచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఆర్, మహావీర్ కళాశాలల్లోనూ తుదివిడత తనిఖీలు పూర్తి చేసినట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఈ కళాశాలల సీట్లు కొనసాగే అవకాశాలే ఎక్కువని సమాచారం. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ వైద్య కళాశాలల్లో కలిపి 6,240 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
ఇవీ చదవండి: