తెలంగాణ

telangana

ETV Bharat / city

కేంద్రం నివేదిక: ఆంధ్రప్రదేశ్​లో తగ్గిన ప్రసూతి మరణాలు

ఏపీలో మాతృ మరణాలు తగ్గాయని కేంద్రం తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో స్పష్టం చేసింది. 2014-16 మధ్యకాలంలో సగటున లక్ష ప్రసవాలు జరగ్గా.. 74 మంది మృత్యువాత పడ్డారు. 2016-18 వ్యవధిలో ఆ సంఖ్య 65కు తగ్గినట్లు కేంద్రం పేర్కొంది.

కేంద్రం నివేదిక: ఆంధ్రప్రదేశ్​లో తగ్గిన  ప్రసూతి మరణాలు
కేంద్రం నివేదిక: ఆంధ్రప్రదేశ్​లో తగ్గిన ప్రసూతి మరణాలు

By

Published : Jul 21, 2020, 3:25 PM IST

ఆంధ్రప్రదేశ్​లో... ప్రసూతి మరణాల సంఖ్య తగ్గింది. 2014-16 మధ్యకాలంలో సగటున లక్ష ప్రసవాలకు 74 మంది మృత్యువాత పడగా.. 2016-18 వ్యవధిలో ఆ సంఖ్య 65కు తగ్గినట్లు కేంద్రం తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా చూస్తే ఈ సంఖ్య 130 నుంచి 113కు తగ్గింది. నిర్దేశిత కాలంలో దేశంలో అతి తక్కువ మాతృ మరణాలు నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచింది.

మొదటి స్థానంలో కేరళ(43) నిలవగా మహారాష్ట్ర(46), తమిళనాడు(60), తెలంగాణ(63) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అత్యధికంగా మాతృ మరణాలు నమోదైన రాష్ట్రాల్లో అసోం(215) మొదటిస్థానంలో ఉంది. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలతో(126) పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో (67) ఈ సంఖ్య తక్కువగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details