'దేశం దాటినా... అమ్మ భాషపై మమకారం పదిలం'
సుమారు 180 ఏళ్ల క్రితమే తెలుగు భూమి నుంచి... మారిషస్ దేశానికి వలస వెళ్లిన ఓ కుటుంబం మాతృభాషపై మమకారాన్ని వదులుకోలేదు. మధురమైన తెలుగు భాషను వారసత్వంగా అందిపుచ్చుకొని ఆ దేశంలోనూ భాష అభివృద్ధికి కృషిచేస్తోంది. మారిషస్‌లో తెలుగుభాష బోధనాధికారిగా పనిచేస్తున్న సంజీవ నరసింహ... విజయవాడలో జరుగుతున్న నాలుగో ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పాల్గొన్నారు. రావి ఆకులపై తెలుగు వైభవాన్ని నిక్షిప్తం చేసి భాష, సంస్కృతి అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అందరినీ ఆకర్షిస్తోంది. మాతృభాషను పరిరక్షించుకుంటూనే పాశ్చాత్య సంస్కృతిని అలవరచుకోవాలని చెబుతున్న సంజీవ నరసింహతో... 'ఈటీవీభారత్' ముఖాముఖి.
'దేశం దాటినా... అమ్మ భాషపై మమకారం పదిలం'