మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి చనిపోయాడని(Maoist leader Ravi died) కొంత కాలంగా వస్తున్న వార్తలను ఆ కమిటీ ధ్రువీకరించింది. ఝార్ఖండ్లో బాంబులను పరీక్షిస్తున్న సమయంలో.. ప్రమాదవశాత్తు పేలడంతో(bomb blast) అక్కడికక్కడే చనిపోయాడని తెలిపింది. అయితే మావోయిస్టు నేత రవి ఏడాదిన్నర క్రితమే మరణించగా.. తాజాగా ధ్రువీకరించడం గమనార్హం.
బాంబు పేలి మావోయిస్టు నేత మృతి.. ఏడాదిన్నర తర్వాత ప్రకటన...! - మావోయిస్టు రవి మృతి
బాంబులను పరీక్షిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలి(bomb blast) మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి(Maoist leader Ravi died) చెందాడు. ఏడాదిన్నర క్రితం రవి మరణించగా.. తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ(Maoist Central Committee) ప్రకటించింది.
Maoist leader Ravi died in bomb blast
గతేడాది జూన్ 25న బాంబు పేలి.. రవి తీవ్రంగా గాయపడి మృతి(Maoist leader Ravi died) చెందాడు. అయితే మరుసటి రోజునే అతని అంత్యక్రియలు జరిపినట్టుగా కమిటీ వెల్లడించింది. నెల్లూరు జిల్లాకు చెందిన రవి.. మావోయిస్టు కేంద్ర కమిటీలో టెక్ టీమ్ సభ్యుడిగా పనిచేశాడు. ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేయడంతో అతనికి నైపుణ్యం ఉంది.
ఇదీ చూడండి:తలపై రూ.కోటి రివార్డు ఉన్న మావోయిస్టు టాప్ కమాండర్ అరెస్ట్!