తెలంగాణ

telangana

ETV Bharat / city

అన్నార్తులకు చేయూత.. నిత్యవసర సరకుల పంపిణీ

లాక్​డౌన్​ దృష్ట్యా పూటగడవని నిరుపేదలకు హైదరాబాద్​కు చెందిన కింగ్స్​ గ్రూపు చేయూతనందిస్తోంది. బియ్యం, పప్పు, ఉప్పు, నూనె, కారం, పసుపుతో కూడిన సంచిని పూరి గుడిసెలు, వెనుకబడిన బస్తీలలో తిరుగుతూ పంపిణీ చేసింది.

many companies being helping to poor in hyderabad
అన్నార్తులకు చేయూత.. నిత్యవసర సరకుల పంపిణీ

By

Published : Apr 3, 2020, 11:13 AM IST

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన రోజువారీ కూలీల కుటుంబాలకు నిత్యవసర సరకులను అందించేందుకు ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ చేస్తోంది. సర్కారు సాయానికి చేదోడుగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు కంపెనీలు మేము సైతం అంటూ ఈ క్రతువులో భాగస్వాములవుతున్నారు. హైదరాబాద్​కు చెందిన కింగ్స్ గ్రూపు నగరంలోని 15 ప్రాంతాలలో నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరకులతో కూడిన కిట్​ను వాడవాడలా తిరుగుతూ అందించింది.

బియ్యం, పప్పు, ఉప్పు, నూనె, కారం, పసుపుతో కూడిన సంచిని పూరి గుడిసెలు, వెనుకబడిన బస్తీలలో తిరుగుతూ పంపిణీ చేశారు. ఆపత్కాలంలో నిరుపేదలను ఆదుకుంటున్నారు. సమాజంలో మెరుగైన జీవనం గడుపుతున్న వారు నిరుపేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలని వారు కోరారు.

అన్నార్తులకు చేయూత.. నిత్యవసర సరకుల పంపిణీ

ఇవీచూడండి: లాక్​డౌన్​తో మూగజీవాలకు కష్టకాలం

ABOUT THE AUTHOR

...view details