తెలంగాణ

telangana

ETV Bharat / city

కాలాపత్తర్​లో దారుణం.. ఇంటి సమీపంలోనే వ్యక్తి హత్య

హైదరాబాద్​ కాలాపత్తర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని మక్కా కాలనీలో అహ్మద్​ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటికి సమీపంలో మాటువేసిన దుండగులు కత్తులతో దాడిచేసి హతమార్చారు.

కాలాపత్తర్​లో దారుణం.. ఇంటికి సమీపంలోనే వ్యక్తి హత్య

By

Published : Nov 23, 2019, 6:33 AM IST

హైదరాబాద్​ పాతబస్తీ కాలాపత్తర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో దారుణం జరిగింది. మక్కా కాలనీకి చెందిన అహ్మద్​ హత్యకు గురయ్యాడు.​ ఇంటికి కేవలం 50 అడుగుల దూరంలో కాపుకాచిన దుండగులు కత్తులతో దాడిచేసి హతమార్చారు. సమాచారం అందుకున్న ఏసీపీ అంజయ్య ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్​ టీంతో ఆధారాలు సేకరించారు. అరిఫ్​ అనే వ్యక్తి హత్యకు పాల్పడినట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధరణ అయిందని ఏసీపీ తెలిపారు. హత్యకు గల కారణాలుపై ఆరా తీస్తున్నామన్నారు.

కాలాపత్తర్​లో దారుణం.. ఇంటికి సమీపంలోనే వ్యక్తి హత్య

ABOUT THE AUTHOR

...view details