కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఓ యువకుడిని పోలీసులకు అప్పగించారు తోటి ప్రయాణికులు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నిన్న దుబాయ్ నుంచి ముంబయికు చేరుకున్నాడు. అక్కడ క్వారంటైన్లో వైద్య పరీక్షల అనంతరం హైదరాబాద్కు చేరుకున్నాడు. నిన్న సాయంత్రం ఓ ప్రైవేటు బస్సులో భీమవరం వెళ్తుండగా.. అతని చేతికి ఉన్న బ్యాడ్జ్ను తోటి ప్రయాణికులు గమనించారు.
కరోనా అనుమానంతో యువకుడిని పోలీసులకు అప్పగింత - హైదరాబాద్లో కరోనా
కరోనా అనుమానంతో యువకుడిని పోలీసులకు అప్పగించారు తోటి ప్రయాణికులు. ప్రైవేటు బస్సులో భీమవరం వెళ్తుండగా.. అతని చేతికి ఉన్న బ్యాడ్జ్ను తోటి ప్రయాణికులు గమనించారు. ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు.
కరోనా
ముద్ర గురించి ఆరా తీయగా కంగారు పడ్డాడు. యువకుడి ప్రవర్తనతో అనుమానం వచ్చిన ప్రయాణికులు.. చింతలకుంట వద్ద బస్సులో నుంచి కిందకు దింపేశారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ముంబయి క్వారంటైన్ కేంద్రం నుంచి తప్పించుకుని హైదరాబాద్ చేరుకున్నట్లు అనుమానిస్తున్నారు.
ఇవీ చూడండి:కరోనా పరీక్ష కిట్ల నాణ్యత తేల్చేందుకు 14 సంస్థలకు లైసెన్స్
Last Updated : Mar 21, 2020, 7:15 AM IST