విద్యుత్ తీగ తెగి బాటసారిపై పడడం వల్ల విద్యుదాఘాతం జరిగి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్లోని మియాపూర్ మాతృశ్రీనగర్‌లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతుని వివరాల కోసం ఆరా తీస్తున్నారు. రెండు నెలల క్రితం మాతృశ్రీనగర్‌లో 11కేవీ విద్యుత్ తీగలపై చీర గాలికి ఎగిరి వచ్చిపడింది. దానిని విద్యుత్ శాఖాధికారులు తొలగించకుండా అలాగే వదిలేశారు. సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడం వల్ల చీర తడిసి తీగలకు తగలింది. రెండు తీగలకు విద్యుదాఘాతం జరిగి అటుగా వస్తున్న గుర్తు తెలియని వ్యక్తిపై పడడం వల్ల అతను మృత్యువాత పడ్డాడు. విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి
విద్యుత్ తీగ తెగి బాటసారిపై పడటం వల్ల విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన మియాపూర్ మాతృశ్రీనగర్‌లో చోటుచేసుకుంది. విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి