Liquor Sales increased in Telangana: మద్యం ధరలు పెరిగినా విక్రయాలు తగ్గడం లేదు. కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా గత నెల 19న మద్యం ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే. బీరుపై రూ.10, ఆర్డినరీ క్వార్టర్‌పై రూ.20, ప్రీమియం క్వార్టర్‌పై రూ.40 చొప్పున పెంచారు. ముఖ్యంగా చీప్ లిక్కర్ క్వార్టర్ ధరను రూ.95 నుంచి రూ.120కి పెంచడంతో విక్రయాలపై ప్రభావం ఉంటుందని అధికారులు భావించారు. ఎందుకంటే మొత్తం మద్యం విక్రయాల్లో 40-50 శాతం అమ్ముడుపోయేది ఇదే కావడం గమనార్హం. కానీ, అంతకుముందు నెలతో పోల్చితే ధరలు పెంచిన అనంతరం మాసం రోజుల్లో ఏకంగా రూ.530 కోట్లకుపైగా ఎక్కువ అమ్ముడుపోయినట్లు వెల్లడైంది. డిపోల నుంచి సరకు కొనుగోళ్లను పెంచాలని వ్యాపారులకు అధికారులు లక్ష్యాలు నిర్దేశిస్తుంటారు. ఇది ఎప్పుడూ ఉండేదే అయినా.. ఈసారి ఎక్కువ ఒత్తిడి చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విక్రయాల సరళి ఇలా..