తెలంగాణ

telangana

ETV Bharat / city

Prakash raj marriage: విలక్షణ నటుడు ప్రకాశ్​ రాజ్​కు మళ్లీ పెళ్లి..! - కొరియోగ్రాఫర్ పోనీవర్మ

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, కొరియోగ్రాఫర్ పోనీవర్మను మళ్లీ వివాహం చేసుకున్నారు. అయితే.. వీరి కుమారుడి కోరిక మేరకే మళ్లీ వివాహం చేసుకోవడం విశేషం.

Leading actor Prakash Raj has remarried choreographer Ponni varma
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్

By

Published : Aug 25, 2021, 9:59 AM IST

ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటి? అనుకుంటున్నారా! అయితే మీ సందేహం నిజమే. అది ఉత్తుత్తి పెళ్లి మాత్రమే. తనయుడు వేదాంత్‌ కోరిక మేరకే ఇలా చేసినట్టు ప్రకాశ్‌ రాజ్ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. తన భార్య పోనీ వర్మ, పిల్లలతో దిగిన ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నారు. 'మా పెళ్లికి సాక్షిగా వేదాంత్‌ ఉండాలనుకున్నాడు. అందుకే ఈ రాత్రి మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం' అని ప్రకాశ్‌ రాజ్‌ తెలిపారు.

మొదటి భార్య లలిత కుమారికి విడాకులు ఇచ్చిన తర్వాత కొరియోగ్రాఫర్‌ పోనీవర్మని ప్రకాశ్‌ రాజ్‌ 2010లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు ప్రకాశ్‌ రాజ్‌. ఇటీవల ఆయన చేతికి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు.. 'మూవీ ఆర్ట్స్‌ అసోసియేషన్‌' అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారాయన. 'సినిమా బిడ్డలం‌' పేరుతో ప్యానల్‌ కూడా ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details